Timed Out : ‘టైమ్డ్ అవుట్’ అంటే ఏంటి?

-

 

Timed Out: ‘టైమ్డ్ అవుట్’ అంటే ఏంటి?… క్రీజులో ఉన్న బ్యాటర్ అవుట్ అయిన వెంటనే నిర్నిత సమయంలోగా తర్వాతి బ్యాటర్ బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అంతర్జాతీయ క్రికెట్ లో ఆ సమయం మూడు నిమిషాలుగా ఉండేది. 2023 వన్డే వరల్డ్ కప్ నిబంధనలో ఆ గడువును రెండు నిమిషాలకు తగ్గించారు.

What is Timed Out in Cricket How Did Angelo Mathew Get Out Without Facing a Single Ball

అంటే రెండు నిమిషాల్లోగా తర్వాతి బ్యాటర్ క్రీజులోకి రావాల్సి ఉంటుంది. ఆ గడువులోగా బ్యాటర్ రాకపోతే దాన్ని టైమ్ డ్ అవుట్ గా పేర్కొంటూ…. ఆ క్రికెటర్ ను అవుట్ గా ప్రకటిస్తారు. కాగా… వరల్డ్ కప్ 2023 లో భాగంగా శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టైం ఔట్ కారణంగా బ్యాటింగ్ చేయకుండానే ఔట్ అయ్యాడు శ్రీలంక బ్యాటర్ మాథ్యూస్.. సమరవిక్రమ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన మాథ్యూస్.. హెల్మెట్ క్లిప్ ఊడిపోవడంతో మరో హెల్మెట్ తప్పించుకున్నాడు.

అయితే… అప్పటికే టైం ఔట్ అని అప్పీల్ చేశాడు బంగ్లా కెప్టెన్ షకీబ్. బంగ్లా తన అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటే మాథ్యూస్ బ్యాటింగ్ చేయొచ్చు అని చెప్పారు ఎంపైర్లు. కానీ బంగ్లా తన అప్పీల్‌ను వెనక్కి తీసుకోకపోవడంతో బ్యాటింగ్ చేయకుండానే ఔట్‌గా వెనుదిరిగాడు మాథ్యూస్. దీంతో
శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. అంతేకాదు… బంగ్లా బ్యాటింగ్ కి రాగానే జట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news