కోల్‌కతాలో మాత్రమే పోలీసులకు వైట్‌ యూనిఫాం.. ఎందుకో తెలుసా..?

-

పోలీసులకు మారో పేరే ఖాకీ. ఎందుకంటే వారు ధరించే యూనిఫాం ఆ కలర్‌లో ఉంటుంది కాబట్టి వారిని ఖాకీ అంటారు. దేశంలో మొత్తంలో పోలీస్‌ శాఖకు ఖాకీ రంగు యూనిఫామ్‌ ఉంటే కోల్‌కతాలో మాత్రమే విభిన్నంగా తెలుపు రంగు యూనిఫామ్‌ ఉంటుంది. భారతదేశంలో ఆంగ్లేయులు అడుగుపెట్టి మొదటగా పశ్చిమ బెంగాల్‌లో స్థిరపడ్డారు. ఆ తర్వాత ఈస్ట్‌ ఇండియా కంపెనీ స్థాపన అనంతరం దేశాన్ని వారి ఆధీనంలోకి తీసుకొని పాలించడం మొదటు పెట్టారు.

బ్రిటీష్‌ కాలం నుంచే..

అప్పుడే వారు పోలీస్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి వారికి యూనిఫాంగా తెలుపు రంగు దుస్తులు ధరించాలని ఆదేశించింది. అయితే విధుల్లో భాగంగా వారు బయటి తిరగే క్రమంలో తెలుపురంగు దుస్తులు మురికిగా మారేవి. ఎక్కువ సమయం బయట కేటాయించడంతో వివిధ రకాల మరకాలు అంటి దుర్గంధంగా కనిపించేవి. ఉతికినా మరకలు పోకపోవడంతో కొన్ని సార్లు తెలుపు రంగుతో మరకలపై అంటించి విధుల్లో పాల్గొనేవారు. ఇంకొంత మంది పొలీసులు తమ యూనిఫాంకు లేత నీలిరంగు వేసుకునేవారు. ఈ సమస్యను గుర్తించి ఉన్నతా«ధికారులు, ఖాకీ రంగు యూనిఫాం ధరిస్తే ఈ రంగు మట్టిలాగే ఉంటుంది ఒకవేళ దుమ్ము, మురికి అంటినా అంతా కనిపించదని భావించారు. పోలీసులు టీ ఆకులు, ఫ్యాబ్రిక్‌ రంగులతో తెలుపుగా ఉన్న పోలీస్‌ యూనిఫామ్‌ను ఖాకీ రంగు వచ్చేలా మార్చుకునేవారు.

ఇప్పుడూ తెలుపే..

సర్‌ హెన్రీ లారెన్స్‌ అనే బ్రిటీష్‌ ఆఫిసర్‌ 1846లో కార్ప్స్‌ ఆఫ్‌ గైడ్స్‌ అనే పేరుతో ఆర్మీలో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు సైతం పోలీస్‌ శాఖలో లేత నీలిరంగు, తెలుపు, టీ ఆకులతో ఖాకీగా మార్చిన తెలుపు రంగు దుస్తులనే యూనిఫామ్‌గా ధరించేవారు. 1847లో ఆ అధికారి ఆదేశాల మేరకు ఖాకీ రంగు యూనిఫాంను అధికారికంగా మార్చేశారు. పశ్చిమ బెంగాల్‌లో రెండు రకాల పోలీస్‌ శాఖలు ఉన్నావి. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర పోలీస్‌ శాఖ ఒక్కటైతే.. కోల్‌కతా మెట్రోపాలిటల్‌ నగర పోలీస్‌ శాఖ ఇంకొక్కటి.

ఉష్ణోగ్రతను తట్టుకుంటాయని..

1845లో బ్రిటీష్‌ గవర్నమెంట్‌ కోల్‌కతా కోసం ఏర్పాటు చేసినా పోలీస్‌ శాఖ తెలుపు రంగు యూనిఫాంనే ధరించేవారు. రెండేళ్ల తర్వాత పోలీస్‌లు అంతా ఖాకీ యూనిఫాం ధరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయగా అందుకు కోల్‌కతా పోలీసులు మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే కోల్‌కతా నగరం సముద్ర తీరానికి దగ్గరగ ఉండటంతో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. ఆ ఉష్ణోగ్రతను తెలుపు రంగు దుస్తులే తట్టుకుంటాయని వారు తేల్చి చెప్పారు. 1861లో బెంగాల్‌లో రాష్ట్ర పోలీస్‌ శాఖ ఏర్పాటైంది. వారు కూడా తెలుపు రంగే ధరించారు. రానురాను ఖాకీ రంగులోకి మార్చారు. కోల్‌కతా –హౌరా నగరాల పోలీసులు మాత్రం ఇప్పటికీ తెలుపు రంగు యూనిఫామే వాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version