బీజేపీకి ఎంఐఎం ప్రత్యామ్నయంగా మారుతుందా..?

-

దేశంగా వ్యాప్తంగా ఎంఐఎం పార్టీ పార్టీ విస్తరణ చాపకింద నీరుల సాగుంది..ఇటీవలే కాలంగా పార్టీ జాతీయ స్థాయిలో తన ప్రభావాన్ని చూపిస్తుంది..దేశంలో బీజీపీ పార్టీ 90 తర్వాత క్రమంగా తన బలాన్ని పుంజుకుంది..జాతీయత, మతం ఆధారంగా పార్టీ విస్తరించింది..అదే ఫార్ములాను ఇప్పుడు ఎంఐఎం అనుసరిస్తుంది..భవిష్యత్తులో బీజేపీకి ఎంఐఎం పార్టీ ప్రత్యామ్నయంగా మారనుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


ఇటీవలే పార్టీ విస్తణపై దృష్టి పెట్టిన ఎంఐఎం అధినేత..దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన పార్టీ పోటీ చేస్తుంది..కాంగ్రెస్‌, బీజేపీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహా(మజ్లిస్) తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తుంది..కాంగ్రెస్‌ పార్టీతో పోత్తులతోనే దేశ వ్యాప్తంగా పార్టీ విస్తరణ జరగలేదని గుర్తించిన అసదుద్దీన్ ఒవైసీ 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ కూటమి నుంచి బయటకు వచ్చారు.

పార్టీ విస్తరణపై దృష్టి పెట్టిన ఒవైసీ పార్టీకి కేంద్రమైన తెలంగాణలో అధికారపార్టీతో స్నేహ హస్తాన్ని అందిస్తుంది..మొదటి నుంచి టీఆర్‌ఎస్‌ తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలకు మత్తు ఇస్తుంది..గ్రేటర్‌లో తన ప్రభావాన్ని నిలుపుకోవడానికి ప్రభుత్వంతో సఖ్యతను కొనసాగిస్తూ..తన పని చేసుకుంటు పోతుంది..ప్రతి పక్షాలు ప్రభుత్వం విమర్శలు చేస్తున్న ప్రతి సారి కేసీఆర్‌ సాబ్‌కు నేనున్నానంటూ అసద్‌ ముందుకు వస్తున్నారు..తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీని రాజకీయంగా ఎదగకుండా టీఆర్‌ఎస్‌-ఎంఐఎం పొత్తులతో అడ్డుకుంటున్నారు..ఈ పొత్తులతో టీఆర్‌ఎస్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని..అందుకు దుబ్బాక ఉప ఎన్నికలే నిదర్శనం అంటున్నారు..దుబ్బాక ఎన్నికల్లో ఎంఐఎం మౌనం టీఆర్‌ఎస్‌ కంటే బీజేపీకే ఎక్కువ లాభం చేకుర్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు..ఎంఐఎంకు మాత్రం టీఆర్‌ఎస్‌తో స్నేహ హస్తం ఎంతో లాభిస్తుందంటున్నారు.

దేశంలో ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగిన ఎంఐఎం పోటీలో ఉంటుంది..బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ఉన్న గ్యాప్‌ను ఎంఐఎం భర్తీ చేయాలని చూస్తుంది..రెండు జాతీయ పార్టీలకు మేమే ప్రత్యామ్నయం అంటూ ముందుకు వస్తుంది..చాలా రాష్ట్రాల్లో స్థానిక లోకల్‌ పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తితితో ఓటర్ల బీజేపీ, కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలకు వెళ్ళకుండా తమ వైపు తిప్పుకుంటుంది ఎంఐఎం..
ముఖ్యంగా ఇటీవలే జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు,ఉప ఎన్నికల్లో ఎంఐఎం అనుసరించిన రాజకీయ ఎత్తుగడలను పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు..స్ధానికంగా లోకల్‌ పార్టీలు,బీజేపీపై ఉన్నఅసంతృప్తిని ఎంఐఎం తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధించింది..మహారాష్ట్ర,కర్నాటక,యూపీ, బీహార్ ఎన్నికల్లో తన ప్రభావాన్ని స్పష్టంగా చూసించింది..బీహార్‌లో అయితే ఏకంగా 5 స్థానాల్లో విజయం సాధించింది..దీంతో బీజేపీకి భవిష్యత్‌లు ఎంఐఎమే ప్రత్యామ్నయం కానుందని పరోక్షంగా సంకేతాలు పంపింది.

మరోవైపు త్వరలో బెంగాల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీలో ఉంటుందని ఒవైసీ ప్రకటించారు..బెంగాల్‌లో ముస్తిం ఓట్లను ఎంఐఎం ప్రభావితం చేయనుంది..వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు ఎంఐఎంను పూర్తి స్థాయిలో విస్తరించి ఎన్నికలంటే బీజేపీ-ఎంఐఎం అనే తీరులో వచ్చే అవకాశాలు ఉన్నాయి..బీజేపీ హిందూ ఓటర్లపై ఫోకస్‌ పెడితే..ఎంఐఎం ముస్లిం ఓటర్లపై ఫోకస్ పెట్టారు..భవిష్యత్‌ ఎన్నికల్లో హిందూ ఓటర్లు, ముస్లిం ఓటర్లు ఏకపక్షంగా ఎన్నికలల్లో పాల్గొననున్నారు..

రెండు పార్టీలు మతాల ఆధారంగా రాజకీయం చేసేటివే..కాబట్టి వారు వారి మత ఓట్లపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టనున్నారు..దీంతో సెక్యులర్‌ పార్టీలతో భవిష్యత్‌లో రాజకీయ మనుగడ ప్రమాదంలో పడనుంది..ఇది భారత పెఢరల్ స్తూర్తికి విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజ్యంగ నిపుణులు..స్థానిక పార్టీలు తమ ఉనికిని కొసాగించకపోతే ఈ రెండు మత మత్వ పార్టీలు బీజేపీకి ఎంఐఎం, ఎంఐఎంకు బీజేపీ ప్రత్యామ్నయం కానున్నాయి..సెక్కులర్‌ పార్టీలీ కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయి..తెలంగాణలో ఎంఐఎం పార్టీని కట్టడి చేయకపోతే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ భవిషత్‌లో ఇబ్బందులు తప్పవంటున్నారు రాజకీయ నిపుణులు..ఏ రాజకీయ పార్టీ అయిన రాజకీయంగా ఎదగడంలో ఎవ్వరికి ఇవ్వందులు ఉండవు..ఏదగాలికూడా..అది రాజ్యంగం వారికి కల్పించిన హక్కు..అంతే కాని కులాలు,మతాలు ఆధారంగా రాజకీయంగా ఎదగాలిని కోవడం రాజ్యంగ విరుద్దం..అది భవిష్యత్‌లో నియంతృత్వపోగడలకు దారి తీసేప్రమాదం ఉంటుందంటున్నారు ఎక్స్‌ఫర్ట్స్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version