తాత వ‌య‌స్సులో తండ్రి అయ్యాడు

-

జమ్ము కశ్మీర్ లో అద్భుతం జరిగింది. 80 ఏళ్ల వృద్ధుడు తండ్రయ్యాడు. పూంచ్ జిల్లాకు చెందిన హకీం అత్యంత వృద్ధ వయసులో తండ్రయి చరిత్ర సృష్టించాడు. ఆయన భార్యకు 65 ఏళ్లు. ఇంత లేటు వయసులో బిడ్డకు జన్మనివ్వడం అనేది అరుదైన ఘటనగా వైద్యులు చెబుతున్నారు.

నిజానికి.. మహిళల్లో రుతుక్రమం 45 నుంచి 50 ఏళ్లలోపునే ఆగిపోతుందట. ఒక్కసారి రుతుక్రమం ఆగిపోతే.. మళ్లీ గర్భం దాల్చడం అసంభవం. కానీ.. 65 ఏళ్ల మహిళ మళ్లీ గర్భం దాల్చడం అనేది చాలా అరుదని డాక్టర్లు చెబుతున్నారు.

ప్రపంచంలో ఇలా ఎక్కువ ఏజ్ లో బిడ్డను కని రికార్డు సృష్టించింది స్పెయిన్ కు చెందిన 66 ఏళ్ల మారియా. కాకపోతే మారియా ఐవీఎఫ్ విధానంలో బిడ్డను కన్నది. లేటు వయసులో నాచురల్ గా బిడ్డను కని జమ్ముకు చెందిన ఈ వృద్ధ జంట రికార్డు సృష్టించారు. వాళ్లకు ఇప్పటికే పదేళ్ల కొడుకు ఉండగా… మళ్లీ సంతానం కోసం ప్రయత్నిస్తుంటే ఇప్పుడు ఆడబిడ్డ పుట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version