ఇవాళ రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు

-

ఏళ్ల తరబడి జరిపిన పోరాటానికి ఎట్టకేలకు ప్రతిఫలం లభించింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న విజ్ఞప్తికి ఎట్టకేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంట్​లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ఇప్పటికే రాజ్యసభలో చర్చలు జరగ్గా.. తాజాగా లోక్​సభలో వాడీవేడీ చర్చ సాగింది. చివరకు బుధవారం రోజున లోక్​సభ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది.

ఈ క్రమంలో ఇవాళ రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు రానుంది. 2010లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించినా లోక్‌సభ పచ్చజెండా ఊపలేదు. దాదాపు 27ఏళ్లుగా ఇది పెండింగ్‌లోనే ఉంది. ఈసారి మహిళా రిజర్వేషన్లకు దాదాపు పార్టీలన్నీ మద్దతుగా నిలవడంతో ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభ ఆమోదం కూడా లభిస్తే నియోజక వర్గాల డీలిమిటేషన్‌ ప్రక్రియ పూర్తైన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. మరోవైపు నేడు లోక్​సభలో చంద్రయాన్-3 విజయవంపై చర్చ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version