సచివాలయ ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నారు : సుధాకర్ బాబు

-

చంద్రబాబు గత పరిపాలనలో పేదలకు సెంటు భూమి ఇచ్చిన చరిత్ర లేదు. కానీ గత వైసీపీ హయంలో 30.6 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు అని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసం 15 వేల కోట్లతో భూములు కొనుగోలు చేసిన జగన్.. దేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా పేదల స్థలాల కోసం ఇంత ఖర్చు చేయలేదు. ఇప్పటికే లబ్ధిదారులకు పంపిణీ చేసిన భూములను రద్దు చేసి మరోసారి పంపిణీ చేసేందుకు సిద్ధం కావటం దారుణం.

చిన్న చిన్న కారణాలతో ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామనటం దుర్మార్గం. జగనన్న కాలనీలపై నాడు పెడర్ధాలు తీసి ఇప్పుడు తిరిగి అదే స్థలాలు పంపిణీ చేస్తామంటున్నారు. ఇళ్ల పట్టాలు పొందిన వారిలో కూటమి పార్టీలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలపై లబ్ధిదారులకు సర్వ హక్కులు ఇచ్చిన జగన్.. పేదలను భయ బ్రాంతులకు గురి చేస్తుంది. కూటమి ప్రభుత్వం. చంద్రబాబుకు పేదలకు మంచి చేయాలనుకుంటే కొత్త భూములు కొని పంపిణీ చేయాలి. కానీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నారు అంటూ సుధాకర్ బాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version