అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డులు అందజేస్తాం : మంత్రి ఉత్తమ్

-

తెలంగాణలో రేషన్ కార్డులు ఈనెల 26 నుంచి జారీ చేయనున్నట్టు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే గ్రామాల్లో కొంత మందికి రేషన్ కార్డులు వచ్చినట్టు.. పంచాయతీ సెక్రెటరీలు రేషన్ కార్డులు వచ్చిన వారికి సంబంధించిన ఆధార్ కార్డుల సేకరణ కార్యక్రమం చేపడుతున్నారు. కులగణనలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు వచ్చినట్టు సమాచారం.

రేషన్ కార్డుల్లో పేర్లు రాని కాస్త గందరగోళంలో పడ్డట్టు తెలుస్తోంది. దీనిపై తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. తొలుత కులగణనలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని.. రేషన్ కార్డుకు అర్హత ఉండి రాని వారు ఈనెల 26 నుంచి మళ్లీ దరఖాస్తులు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్టు తెలిపారు. అర్హులైన వారందరికీ తప్పకుండా రేషన్ కార్డు అందజేస్తామని వెల్లడించారు. కులగణన జాబితాలో లేని వారు గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అలాగే  పాత రేషన్ కార్డుల్లో పేర్లు నమోదు చేసుకునేందుకు, తొలగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version