బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదనేది పచ్చి అబద్ధం : హరీశ్ రావు

-

బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదనేది పచ్చి అబద్ధం అని మాజీ మంత్రి హరీశ్ రావు  పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో  మీడియాతో మాట్లాడారు.  రేషన్ కార్డుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయ పరిమితి పెంచలేదు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.2లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 3లక్షల 40వేల వరకు పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డుల కోసం మళ్లీ దరఖాస్తు చేయమనడం దుర్మార్గం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6లక్షల 47 వేల రేషన్ కార్డులు ఇచ్చినట్టు తెలిపారు.

వృద్ధులు, వితంతువులకు రూ.4వేల పెన్షన్ అమలు కావడం లేదు. రుణమాఫీ చేయకపోవడంతో ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.  రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేయాలని.. ఆదిలాబాద్ కి చెందిన జాదవ్ కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ జాదవ్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేవిధంగా చూడండి. లేదంటే రేషన్ కార్డులు రానివారు గ్రామ గ్రామన నిలదీస్తారని చెప్పారు. నిలదీత వద్దనుకుంటే నిబంధనలు సవరించండి అని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version