ప్రజా పాలనలో దరఖాస్తులు ఏమయ్యాయి..? అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే లబ్దిదారులకు న్యాయం జరిగిందన్నారు. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలం చెందింది. అంగన్ వాడీ టీచర్లకు మా ప్రభుత్వ హయాంలో జీతాలు పెంచామని.. ప్రస్తుతం రూ.13,650 వేతం అందజేస్తున్నారు.
రేషన్ కార్డులపై సీలింగ్ ఎత్తేశామని గుర్తు చేశారు. ఇన్ కమ్ లిమిట్ పెంచలేదు. కుల గణన సర్వేకు, రేషన్ కార్డుకు ఎలా ముడి పెడతారని ప్రశ్నించారు. 6లక్షల 47వేల రేషన్ కార్డులు ఇచ్చినట్టు హరీశ్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి ఏమి చేయలేదు.. రేషన్ కార్డులపై గందరగోళం నెలకొంది అని తెలిపారు.