కేరళ, బెంగళూరు కు ఎల్లో అలెర్ట్.. ఐదు రోజుల పాటు వర్షాలు

-

కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం కురిసిన భారీ వర్షానికి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆదివారం కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్తా వాతావరణ విభాగం(ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా రాబోయే ఐదు రోజుల పాటు నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్గాలు కురుస్తాయని అంచనా వేసింది. జూన్ 5,6 తేదీల వరకు వర్షాలు కొనసాగనున్నాయి. ఓవైపు వర్షం కురుస్తున్నప్పటికీ బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

ఇక ఆదివారం కనిష్టంగా 26.9 డిగ్రీలు ఉంది. బెంగళూరుతో పాటు కేరళ రాష్ట్రంలోనూ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలోని కోజికోడ్లో జూన్ 2-8 తేదీల మధ్య ఉరుములతో కూడిన వర్షాలు కురువనున్నట్టు ఐఎండీ వెల్లడించింది. అలాగే, వచ్చే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు 35-25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండనున్నాయి. మరో దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నెలో తేలికపాటి నుంచి మోస్తరు వర్గాలకు అవకాశం ఉందని ఐఎండీ అభిప్రాయపడింది. చెన్నెలో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 34 డిగ్రీల నుంచి 29 డిగ్రీల మధ్య ఉంటూనే తేలికపాటి వర్షం కురవొచ్చని ఐఎండీ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version