జూన్ 4 తరువాత బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ మిగలరని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించడంపై ఆయన స్పందించారు. రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవ్వడం ఖాయమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినా నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. కేవలం సాంకేతికంగా మాత్రమే నవీన్ కుమార్ రెడ్డి గెలిచారని కామెంట్ చేశారు.
అయినా తమ అభ్యర్థి ఓడింది కేవలం 111 ఓట్లతోనే అని అన్నారు. స్థానిక సంస్థల్లో గతంలో 300 ఓట్లున్న కాంగ్రెస్ బలం 652 ఓట్లకు పెరిగిందని, ఆ విషయాన్ని ప్రత్యర్థి పార్టీ గ్రహించాలని అన్నారు. బీఆర్ఎస్లోగా తాము పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని మంత్రి జూపల్లి, స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలవడం ఖాయమని; జూన్ 4న తరువాత టీఆర్ఎస్ పార్టీలో ఎవరూ మిగలరని మంత్రి జూపల్లి అన్నారు.