Viral Video : రీల్స్ చేస్తూ కాలు, చేయి పోగొట్టుకున్న యువకుడు

-

నేటి యువతకు సోషల్ మీడియా పిచ్చి ముదిరిపోతోంది. ఫాలోవర్లు.. లైక్స్‌ కోసం ప్రాణాలకు తెగించి ఫీట్లు చేస్తున్నారు. ఆ ఫీట్లు చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోతు కన్నవాళ్లకు కడుపుకోత మిగుల్చుతున్నారు. కొన్నిసార్లు ప్రాణాంతక విన్యాసాలతో తీవ్రంగా గాయపడి జీవచ్ఛవంలా మిగిలిపోతున్నారు. ప్రమాదకరమని తెలిసినా.. లైకులు, వ్యూస్ కోసం బరితెగించి స్టంట్లు చేస్తున్నారు. ఇలాంటి భయంకర స్టంట్లపై తాజాగా సెంట్రల్‌ రైల్వే సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

యువత ప్రమాదకరమైన స్టంట్లు చేయడం మానుకోవాలని అవగాహన కల్పిస్తూ ఓ యువకుడి విషాదగాథ సెంట్రలై రైల్వే పోస్టు చేసింది. వీడియోలో మస్జిత్‌ షా అనే యువకుడు కదులుతున్న రైలు హ్యాండిల్‌ను రెండు చేతులతో పట్టుకొని పరుగులు తీశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. అతణ్ని అదుపులోకి తీసుకోవాలని అతడి ఇంటికి వెళ్లిన పోలీసులు మస్తిత్ పరిస్థితి చూసి షాక్ అయ్యారు. ఒక కాలు, చేయి కోల్పోయిన స్థితిలో ఆ యువకుడు కనిపించాడని.. ఏప్రిల్‌ 14న రైల్వేస్టేషనులో రీల్స్‌ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు. మస్జిత్‌ షా ఘటన ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పీఆర్వో స్వప్నిల్‌ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news