ఆధ్యాత్మిక గురువు దలైలామాకు భారత హోంమంత్రిత్వ శాఖ జడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది. చైనా మద్దతు దారుల నుంచి ఆయనకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్టు సమాచారం. అందుకే ఆయనకు ఈ భద్రతను ఏర్పాటు చేసినట్టు విశ్వసనీయయ వర్గాలు వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఉన్న దలైలామా నివాసం వద్ద భద్రతా ఉంటుంది. దీంతో పాటు అదనంగా శిక్షణ పొందిన డ్రైవర్లు, సిబ్బంది ఉంటారు.
చైనా పాలనను వ్యతిరేకించిన దలైలామా 1959 నుంచి భారత్ తోనే ఉంటున్న విషయం తెలిసిందే. భౌగోళిక రాజకీయాల ఉద్రిక్తతల అంశాన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఆయనకు Z+ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది. చైనా మద్దతు గల వ్యక్తులు, సంస్థలతో ఆయనకు ముప్పు ఉన్నట్టు అనుమానాలు కూడా ఉన్నాయి. భిన్న సాంప్రదాయాల ప్రాముఖ్యతను చైనా నాయకత్వం అర్థం చేసుకోలేదని గతంలో ఆయన విమర్శించారు.