రిలయన్స్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు పదవులకు అనిల్ అంబానీ రాజీనామా…

-

శుక్రవారంనాడు రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకు అనిల్ ధీరూభాయ్ అంబానీ (ADAG) రాజీనామా చేశారు. అంతకుముందు స్టాక్ ఎక్స్చేంజి లలో లిస్టెడ్ కంపెనీలలొ చేరకుండా అనిల్ అంబాని ని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబి) నిషేధించిన సంగతి తెలిసిందే. సెబి మధ్యంతర ఉత్తర్వుల తరువాత కంపెనీ డైరెక్టర్ పదవినుంచి అనిల్ అంబానీ వైదిలిగినట్లు రిలయన్స్ పవర్ స్టాక్ మార్కెట్ కు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.

 

రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సెబి మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా” కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుంచి అనిల్ అంబానీ రాజీనామా చేసినట్లు స్టాక్ ఎక్స్చేంజికి తెలిపింది.ఫిబ్రవరిలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, మరో ముగ్గురిపై డబ్బు విత్ డ్రా చేశారనే ఆరోపణలపై సెబి నిషేధం విధించింది.అనిల్ అంబానీ కంపెనీని కొనుగోలు చేసేందుకు గౌతమ్ అదాని ఆసక్తి చూపుతున్నారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ అప్పులలొ కూరుకుపోయి ఉంది.రిలయన్స్ క్యాపిటల్ 1986వ సంవత్సరంలో స్థాపించారు.అయితే పాలనా లోపం చెల్లింపుడిఫాల్ట్ కారణంగా నవంబర్ 29న రిలయన్స్ క్యాపిటల్ బోర్డును ఆర్బిఐ రద్దుచేసింది.సెప్టెంబర్ 2021లో రిలయన్స్ క్యాపిటల్ తన వార్షిక జనరల్ మీటింగ్ లో కంపెనీపై మొత్తం ఋణం 40 వేల కోట్లు అని వాటాదారులకు తెలిపింది.డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ: 1759 కోట్లకు తగ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news