జాతీయవాద నాయకులే రాడికల్ లెఫ్ట్ టార్గెట్ :అస్సాం సీఎం

-

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు చోటు చేసుకోగా, ఇప్పడు ఇది వరల్డ్ వై డ్ గా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు.ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతీయవాద నాయకులను రాడికల్ లెఫ్ట్ టార్గెట్ చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.భౌతిక లేదా ఇతరత్రా దాడులు దేశం ఫస్ట్ అనే భావజాలాన్ని మాత్రం ఓడించలేవు. ఇది లోతైన ఆధ్యాత్మికతలో పాతుకుపోయింది అని అన్నారు .

సనాతన తత్వశాస్త్రం నుండి ప్రేరణ పొందింది. ‘జననీ జన్మభూమి చ స్వర్గాదపి గరీయసీ’ అంటూ ఎక్స్(ట్విట్టర్) లో అస్సాం సీఎం పేర్కొన్నారు. అలాగే, ట్రంప్‌కు మద్దతుగా నిలవండి, నేషన్ ఫస్ట్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఈ సందర్భంగా జోడించారు. పెన్సిల్వేనియా బట్లర్ వద్ద ట్రంప్‌పై కాల్పులు జరగ్గా, ఈ ఘటనలో అదృష్టవశాత్తు బుల్లెట్ డోనాల్డ్ ట్రంప్‌ చెవిని తాకుతూ వెళ్లగా స్వల్పంగా గాయమైంది.అలాగే, ఒకరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తిని 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌గా పేర్కొంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version