తెలుగు సినీ నటుడు ఫిష్ వెంకట్ కొద్ది రోజుల క్రితమే మరణించిన సంగతి తెలిసిందే. ఫిష్ వెంకట్ అనారోగ్య సమస్యల కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అతనికి ఆసుపత్రిలో చికిత్స కోసం సహాయం ఎవరు పెద్దగా చేయలేదు. దీంతో సినీ ఇండస్ట్రీపై అనేక రకాల విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా నట్టి కుమార్ హాట్ కామెంట్స్ చేశారు.

ఫిష్ వెంకట్ ఎక్కడో చాలా దూరంగా ఉంటారు. అతను కేవలం రూ. 300 నుంచి రూ. 30,000 తీసుకునే స్థాయికి ఫిష్ వెంకట్ ఎదిగారు. డబ్బులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అతను MAA మెంబర్ కాదు. సభ్యత్వం కూడా తీసుకోలేదు. సినీ పరిశ్రమలో సంబంధాలు ఉంటేనే సెలబ్రిటీలు వస్తారు. లేకపోతే సహాయం చేయడానికి ఎవరూ కూడా ముందుకు రారు. రేపు నా పరిస్థితి కూడా ఇలానే అవుతుంది కావచ్చు అంటూ నట్టి కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇతను చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.