నవీన్ చంద్ర “తగ్గేదేలే” మూవీ ట్రైలర్ రిలీజ్

-

అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నవీన్ చంద్ర తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. తాజాగా నవీన్ చంద్ర హీరోగా నటించిన చిత్రం “తగ్గేదేలే”. దండుపాళ్యం శ్రీనివాసరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దివ్యా పిలై హీరోయిన్ గా నటిస్తోంది. అనన్యసేన్ గుప్తా, నాగబాబు, పృద్వి, అయ్యప్ప శర్మ, రాజా రవీందర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు.

భద్ర ప్రొడక్షన్స్ పతాకం పై మొదటి చిత్రంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ లని విడుదల చేస్తూ సినిమాపై హైప్ ని క్రియేట్ చేస్తుంది మూవీ యూనిట్. తాజాగా ఈ సినిమాలోని ట్రైలర్ ని విడుదల చేశారు. ఓ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉండబోతుందని ట్రైలర్ లో తెలుస్తోంది. మరి ఈ సినిమా నవీన్ చంద్రకి మంచి బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news