కన్నప్ప నుండి నయన్ అవుట్.. మరో హీరోయిన్ కి ఛాన్స్..!

-

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది. ఈ సినిమాలో మంచు విష్ణు తో పాటుగా కొంతమంది స్టార్స్ నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ శివుడు పాత్రలో కనిపిస్తున్నాడు. నయనతార పార్వతి దేవిగా కనపడనుందని ఆమె కీలకపాత్ర చేస్తుందని నెట్టింట వార్తలు వచ్చాయి. ఈ క్రమం లోనే ఈ సినిమాకి సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.

నయనతార ఈ సినిమా నుండి తప్పుకోవాలని నిర్ణయం తీసుకుందట ఈ సినిమా నుండి
నయన్ తప్పుకుందని అక్షయ్ కుమార్ వంటి ఏజ్డ్ పర్సన్ తో నటించడం ఇష్టం లేక ఈ ప్రాజెక్టు నుండి ఆమె బయటికి వచ్చేసినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఈ నటి స్థానంలో కాజల్ అగర్వాల్ ని విష్ణు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ పక్కన పార్వతి దేవిగా నటించడానికి కాజల్ ఒప్పుకున్నట్లు నయనతారకి బదులుగా కాజల్ నటిస్తోందని వార్తలు వస్తున్నాయి మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news