వివాదంలో చిక్కుకున్న నయనతార సినిమా..

ఈ మధ్యకాలంలో చాలా సినిమాలకు మనోభావాలు దెబ్బ గట్టిగా తగిలిందని చెప్పాలి. మొన్నటికి మొన్న అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన లక్ష్మీ బాంబ్ కి సెగ గట్టిగా తగలగా దానిని పేరు మర్చి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మనోభావాలు సెగ మరో సినిమాకు తగిలింది. తాజాగా లేడీ సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న మూకుత్తి అమ్మన్ అనే మూవీపై వివాదం నెలకొంది. ఓ వర్గం మనోభావాలు కించపరిచారంటూ ఈ సినిమా నిర్మాతలు, దర్శకుని పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఈ సినిమా ప్రదర్శన కూడా నిలిపివేయాలని కోరుతూ కొందరు కోర్టుకు వెళ్ళే యోచనలో ఉన్నారు. ఈ మూకుత్తి అమ్మన్ సినిమాలో అమ్మ వారి పాత్రలో నయనతార నటించింది. ఈ సినిమాను తెలుగులో కూడా అమ్మోరు తల్లి అనే పేరుతో విడుదల చేస్తున్నారు. లాక్ డౌన్ మొదలు ఇండియన్ సినిమా ఇప్పుడు ఒటీటీలోనే రిలీజ్ అవుతూ వస్తోంది. ఈ నెల 14న ఈ సినిమా తెలుగులో అమ్మోరు తల్లి గా తమిళ్ లో మూకుత్తి అమ్మన్ గా దీపావళి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఆపి వేయాలంటూ కేసులు వేయడంతో సినిమా విడుదల మీద సందేహాలు నెలకొన్నాయి.