పోలవరం : మమ్మల్ని కేంద్రం అర్ధం చేసుకుంది, ఇక ఇబ్బంది లేదు !

-

ఏపీ ప్రభుత్వం పోలవరం అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అయితే కేంద్రం నా వల్ల కాదని మాట మార్చడంతో కాస్త టెన్షన్ లో పడింది ఏపీ ప్రభుత్వం. దీంతో ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఆయన కేంద్రం పెద్దలతో ఈ అంశం మీద సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా అయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మారిన అంచనాలకు తగ్గట్లుగానే కేంద్రం ఆర్దిక సహాయం అందిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. గత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏమీ ఆలోచించకుండా రాష్ట్రానికి కలిగే ఆర్ధిక భారం అంచనా వేసుకోకుండా పర్యవసానాలు ఏమీ ఆలోచించకుండా హడావుడిగా కేంద్రంతో చేసుకున్న ఒప్పందం వల్ల రాష్ట్రానికి చాలా నష్టం కలిగే అవకాశం ఉందని బుగ్గన అన్నారు.

పోలవరం నిర్వాసితులు గతంలో 25 వేల ఫ్యామిలీలు ఉండేవని కానీ ఇప్పుడు లక్ష కుటుంబాలయ్యాయని అన్నారు. ముందు లక్ష ఎకరాలు భూసేకరణ అనుకుంటే, ఇప్పుడది లక్షన్నర ఎకరాలయ్యాయని అన్నారు. ప్రాజెక్టు అంచనాలు 2013-14 ఆర్దిక సంవత్సరం లోని ధరల ఆధారంగా ఉన్నాయు. ఇప్పుడు ఆ అంచనాలు బాగా పెరిగాయని అన్నారు. ఇప్పుడు ఈ అంశాలను కేంద్రం అర్ధం చేసుకుందన్న ఆయన ఇప్పుడు మా ప్రభుత్వం చేస్తున్న వాదనలో నిజం ఉందని కేంద్రం అర్ధం చేసుకుందని అన్నారు. ఇక ఈ విషయంలో ఇబ్బంది ఉండకపోవచ్చని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news