తమిళనాడులో ఎన్నికల వేడి మామూలుగా లేదు.. సూర్యుడితో పోటీపడుతూ రాజకీయ నేతలు పోటాపోటీ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే తమిళనాడులో రాజకీయాలకు సినిమాలకు దగ్గర సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.. ఈ ఎన్నికల్లో సైతం చాలా మంది సినిమా వాళ్ళు పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే చాలా మంది సినిమా వాళ్ళు పార్టీల తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ తరఫున సీనియర్ నటుడు రాధారవి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నయనతార మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
నయనతారతో స్టాలిన్ కుమారుడు తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ కి అక్రమ సంబంధం ఉందని, ఈ విషయం గురించి మాట్లాడినందుకు నన్ను ఆ పార్టీ నుంచి బహిష్కరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎంపీ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ఆయన ప్రశ్నించారు. ఇక నటుడు కమల్ హాసన్ కు ప్రధాని మోడీ కి చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్న ఆయన మోడీ దేశాన్ని కాపాడితే కమల్ తన భార్యలను సైతం కాపాడలేకపోయాడు అని అన్నారు. కమల్ ముగ్గురు మహిళల జీవితాలను రోడ్డు పాలు చేశారని ఆయన విమర్శించారు.