నయనతార ఆ విషయంలో ఎక్కడా తగ్గట్లేదుగా..!?

దక్షిణాదిలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఉన్నప్పటికీ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరూ అంటే అందరూ టక్కున చెప్పే పేరు నయనతార. దాదాపు దశాబ్ద కాలానికి పైగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇక అత్యధిక పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో పాటు ఎన్నో రూల్స్ కూడా నిర్మాతలు ముందు ఉంచుతుంది ఈ ముద్దుగుమ్మ. భారీగా పారితోషికం తీసుకున్నప్పటికీ ప్రమోషన్స్ కి మాత్రం రాదు.

ఇదిలా ఉంటే ఇటీవలే నయనతార నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు తల్లి అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార అమ్మోరు పాత్రలో నటించింది. ఈ సినిమాలో పాత్ర కోసం నయనతార భారీగా పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా ఈ సినిమా కోసం నాలుగు కోట్ల వరకు నయనతార డిమాండ్ చేయడంతో అటు నిర్మాతలు కూడా వెనకడుగు వేయకుండా పారితోషికాన్ని చెల్లించారట.