కరోనాకు వ్యాక్సిన్ రాదు.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు..!

-

ప్రస్తుతం దేశంలో శరవేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడానికి వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు ప్రభుత్వాలు కూడా మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది అని చెబుతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ కరోనా వైరస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

కరోనా వైరస్కు వ్యాక్సిన్ ఇప్పటివరకు రాలేదని భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. కరోనా వైరస్ కు మందు వస్తుంది అని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని మునుముందు కరోనా వైరస్ కు మందు ఉండదని… ఎప్పటికీ ఇదే పరిస్థితి ఉంటుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. కేవలం ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి కరోనా వైరస్ ని తరిమి కొట్టాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news