ఒక్క రూపాయికే క్వార్టర్ మద్యం..!

సాధారణంగా మద్యం షాపుల దగ్గర ఎప్పుడూ భారీగా జనాలు ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక మద్యం ధరలు కాస్త తగ్గించారు అంటే మద్యాన్ని భారీగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అదే ఒక రూపాయికే మద్యం ఇస్తున్నాము అనే ఆఫర్ ప్రకటించారు అంటే మద్యం షాపు దగ్గర ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఇలాంటి ఆఫర్ మందుబాబులకు అందింది. సినీ దర్శకుడు శంకర్ పై ఉన్న అభిమానంతో ఆయన పెళ్లి రోజు సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు.. చింతకుంట విష్ణు తన అభిమానాన్ని చాటుకుంటు.. ఈ సరికొత్త ఆఫర్ ప్రకటించాడు

జోగులాంబ గద్వాల్ జిల్లా లో ఉన్న అలంపూర్ లో ఎస్వి వైన్ షాపులో గంటపాటు కేవలం ఒక్క రూపాయికే క్వార్టర్ మద్యం విక్రయించేందుకు ఆఫర్ ప్రకటించాడు. ఇది తెలుసుకున్న మందుబాబులు భారీగా మద్యం షాపు వద్దకు క్యూ కట్టారు. ఇక అందరికీ టోకెన్లు అందించగా కేవలం గంట వ్యవధిలో 45 మంది మాత్రమే ఈ ఆఫర్ను పొందగలిగారు.