NC22 : నాగ చైతన్య ఫస్ట్ లుక్ రిలీజ్..

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంతతో విడాకులు తీసుకున్న అనంతరం నుంచి..నాగ చైతన్య వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నాడు. కథ మరియు కథాంశంలో చాలా భిన్నంగా నాగ చైతన్య వరుసగా సినిమాలు చేస్తూ… ముందుకు సాగుతున్నారు. ఇందులో NV22 పేరుతో ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాకపోయినా.. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం రివీల్‌ చేసింది. ఇప్పటికే ఈ జంట బంగార్రాజు సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమా నుంచి నాగ చైతన్య లుక్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌ లో నాగ చైతన్య ఫేస్‌ కనిపించకపోయినా.. ఓ ప్రభుత్వ అధికారి పాత్రలో చైతూ కనిపించనున్నట్లు మనకు అర్థమౌవుతోంది. అలాగే..ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ రేపటి నుంచి ప్రారంభం కానుందని ప్రకటించింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news