జూన్ 4 న దేశంలో,రాష్ట్రంలో ఎన్డిఏ కూటమి సునామి సృష్టించబోతోంది : సీఎం రమేష్

-

అనకాపల్లిలో బిజెపి కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.జూన్ 4వ తేదీన దేశంలో, రాష్ట్రంలో ఎన్డిఏ కూటమి సునామి సృష్టించబోతోంది అని ధీమా వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం నుండి వచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్స్ దేశంలో, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని వచ్చాయి. వైసీపీ నాయకులు కౌంటింగ్ కు ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తారు, కౌంటింగ్ లో కూటమి ఏజెంట్లు ఎవరు సహనం కోల్పోవద్దు అని తెలిపారు.ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు విశ్వసనీయత లేదు, అది సాక్షి వారు చేయించిన ఎగ్జిట్ పోల్ అని అన్నారు.

కౌంటింగ్ కు వైసీపీ నుండి ఏజెంట్లు ఎవరు వెళ్ళరు అన్న భయంతో వైసిపి నాయకులు ఆత్మసాక్షితో ఎగ్జిట్ పోల్స్ చేయించారు.ఆరా సంస్థతో నేను అనకాపల్లిలో 3 సార్లు సర్వే చేయించాను, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలో కూటమి గెలుస్తుందని నాకు రిపోర్టు ఇచ్చారు.నిన్న ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఆరా మస్తాన్ చెప్పిన విషయాలు ఒక దానికి ఒకటీ పొంతన లేకుండా ఉన్నాయి.175 నియోజకవర్గాలలో సర్వే చేయడానికి కావలసిన నిధులు ఎవరు సమకూర్చాలో ఆరా సంస్థ వెల్లడించాలి అని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version