అర్జున అవార్డులను ప్రకటించిన కేంద్రం : లిస్ట్ లో నీరజ్ చోప్రా, ధావన్

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అర్జున అవార్డు మరియు ఖేల్ రత్న పురస్కారాలను కాసేపటి క్రితమే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అర్జున అవార్డుకు ఏకంగా 35 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం.

అలాగే కేల్ రత్న పురస్కారాలను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇక ఇందులో టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్ కు చోటు కల్పించింది కేంద్రం. టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్ కు అర్జున అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. శిఖర్ ధావన్ అర్జున అవార్డుకు ఎంపిక కాగా నీరజ్ చోప్రా, మిథాలీ రాజ్ సహా 11 మంది ఖేల్ రత్నకు నామినేట్ అయ్యారు.

ఖేల్ రత్న అవార్డులు 2021

నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్)

రవి దహియా (రెజ్లింగ్)

పిఆర్ శ్రీజేష్ (హాకీ)

లోవ్లినా బోర్గోహైన్ (బాక్సింగ్)

సునీల్ చెత్రీ (ఫుట్‌బాల్)

మిథాలీ రాజ్ (క్రికెట్)

ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్)

సుమిత్ యాంటిల్ (అథ్లెటిక్స్)

అవని ​​లేఖ (షూటింగ్)

కృష్ణా నగర్ (బ్యాడ్మింటన్)

మనీష్ నర్వాల్ (షూటింగ్)

అర్జున అవార్డు 2021

యోగేష్ కథునియా (డిస్కస్ త్రో)

నిషాద్ కుమార్ (హైజంప్)

ప్రవీణ్ కుమార్ (హైజంప్)

శరద్ కుమార్ (హైజంప్)

సుహాస్ LY (బ్యాడ్మింటన్)

సింగ్‌రాజ్ అధానా (షూటింగ్)

భావినా పటేల్ (టేబుల్ టెన్నిస్)

హర్విందర్ సింగ్ (ఆర్చరీ)

శిఖర్ ధావన్ (క్రికెట్)