బ్రేకింగ్ : నీట్ పరీక్ష వాయిదా

-

కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరో పరీక్ష వాయిదా పడింది. నిన్ననే సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ, ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న కొద్ది గంటలకే నేషనల్ లెవల్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ ఐన నీట్ పీజీ ఎగ్జామ్ ను వాయిదా వేసినట్లు కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. పరీక్ష తిరిగి ఎప్పుడు నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

వాస్తవానికి ఈ పరీక్ష మరో మూడు రోజుల్లో అనగా ఏప్రిల్ 18న జరగాల్సి ఉంది. నీట్‌ పీజీ పరీక్షలను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలైంది. తొమ్మిది మంది ఎంబీబీఎస్‌ వైద్యుల బృందం ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. కొవిడ్‌ రోగులకు రోజూ చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది భౌతికంగా జరుగుతున్న ఈ పరీక్షకు హాజరయితే వేలాది మంది జీవితాలకు ప్రమాదకరమని పిటిషనర్‌ పేర్కొన్నారు.  అందువల్ల నీట్‌ పీజీ మెడికల్‌ ఎంట్రన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని కోరారు.  

Read more RELATED
Recommended to you

Latest news