గుడ్ న్యూస్.. NEFT ఇక నుంచి 24 గంటలు

-

ఈ రోజుల్లో ఆన్లైన్ లావాదేవీలు క్రమంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దేశంలో నోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్ లావాదేవీలు, నగదు బదిలీలు క్రమ౦గా పెరిగాయి. గతంలో బ్యాంకు లకు వెళ్లి డబ్బులు వేసే వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నగదు బదిలీలు ఎక్కువగా చేస్తున్నారు. ఇక బ్యాంకు లు కూడా వాటికి భద్రత విషయంలో అనేక జాగ్రత్తలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఎక్కువగా బ్యాంకింగ్ వినియోగదారులు వాటిపై మొగ్గు చూపిస్తున్నారు. 

నెఫ్ట్,ఐఎంపిఎస్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో వారికి భారతీయ రిజర్వ్ బ్యాంకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) ద్వారా నగదు ఏ సమయంలో అయినా సరే బదిలీ చేసుకునే సదుపాయం కల్పించింది. నేటి నుంచి నెఫ్ట్ సేవలు 24 గంటలూ.. 365 రోజులూ నిరంతరాయంగా ఆర్బిఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఉదయం 8 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకే నెఫ్ట్ నుంచి నగదు బదిలి అవకాశం ఉండేది.

దీనితో వినియోగదారులు ఎక్కువగా గూగుల్, ఫోన్ పే మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంకు… సమయ పరిమితి విధానంకి గుడ్ బై చెప్పింది. పండుగ రోజుల్లో, సెలవు దినాల్లో సైతం ఇక నెఫ్ట్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఇక వీటిపై చార్జీలను కూడా ఆర్బిఐ ఎత్తేసిన సంగతి తెలిసిందే. డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో ఇక నగదు బదిలీ యాప్ ల మీద ఆధారపడే అవసరం తగ్గనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version