బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్… ఆ రోజు నెఫ్ట్‌ సేవలకు బ్రేక్

-

ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీలు జరిపే బ్యాంక్ కస్టమర్లను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) అప్రమత్తం చేసింది. వచ్చే ఆదివారం నెఫ్ట్‌ (నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌) సేవల్లో అంతరాయం ఏర్పడనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం ఆర్‌బీఐ ట్విటర్‌ ద్వారా ఓ ప్రకటన చేసింది. ఆదివారం 14 గంటల పాటు ఈ సేవలు నిలిచిపోనున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ అఫ్ ఇండియా తెలిపింది.

 

వచ్చే ఆదివారం (మే 22) రోజున వ్యాపార వేళలు ముగిసిన తర్వాత నెఫ్ట్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో టెక్నికల్ అప్‌డేషన్ చేపడుతున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. సాంకేతిక కారణాలతో మే 22 అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెఫ్ట్‌ సేవలు ఆగిపోతాయని పేర్కొంది. ఇక దీనిపై బ్యాంకులు తమ కస్టమర్లకు ముందుగా సమాచారమిస్తాయని ఆర్‌బీఐ తెలిపింది. అయితే ఆర్‌టీజీఎస్‌ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

కాగా ఆర్‌బీఐ, 2019 డిసెంబరు నుంచి నెప్ట్‌ సేవలను 24×7 గంటల పాటు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఏప్రిల్‌ 18న కూడా ఆర్‌టీజీఎస్‌ సేవలకు సంబంధించి ఆర్‌బీఐ ఇలాంటి టెక్నికల్‌ అప్‌గ్రేడ్‌ చేపట్టిన విషయం తెల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version