ఫ్యామిలీ స్టార్‌ సినిమాకి నెగెటివ్‌ రివ్యూలు.. సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు

-

విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. పరశురామ్ పెట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.ఈ సినిమా ఏప్రిల్ 5న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బాగున్నప్పటికీ కూడా కొంతమంది కావాలనే మూవీపై నెగటివ్ రివ్యూస్ ఇస్తున్నారని విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ కలిసి ఆదివారం నాడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిర్మాణ సంస్ధ ఇచ్చిన సోషల్ మీడియా స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా వారు ఫిర్యాదు చేశారు. కొందరు కావాలనే ఇలా నెగటివ్ ప్రచారం చేయడం వల్ల సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపుతుందని వారు అసహనం వ్యక్తం చేశారు.వీరి దగ్గర నుంచి కంప్లైంట్, ప్రాథమిక ఆధారాలు తీసుకున్న పోలీసులు కేసు విచారించి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. విజయ్ మీద ద్వేషంతో ఫ్యామిలీ స్టార్ చూసి బయటకు వచ్చిన తర్వాత యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news