ఏపీ సర్కార్ నిర్లక్ష్యం.. విశాఖ బీచ్‌కు బ్లూ ఫాగ్ గుర్తింపు క్యాన్సిల్

-

ఏపీ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా విశాఖలోని రుషికొండ బీచ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ గుర్తింపును కోల్పోయింది. గతంలో రుషికొండ బీచ్ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్‌‌గా ధృవీకరిస్తూ 2020లో డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ సర్టిఫికెట్ అందించిన విషయం తెలిసిందే.

అయితే, ప్రస్తుతం అక్కడకి శునకాలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వ్యర్థాలు పేరుకుపోవడం, మూత్రశాలలు, దుస్తులు మార్చుకునే గదులు అధ్వానంగా మారడం, నడక మార్గాలు దెబ్బతినడం వంటి విషయాలను గుర్తించిన కొందరు ఫొటోలతో సహా ఎఫ్ఈ సంస్థకు గత నెల 13న ఫిర్యాదు చేశారు. దీంతో రుషికొండ బీచ్‌కు ఇచ్చిన బ్లూ ఫ్లాగ్ గుర్తింపును ఆ సంస్థ రద్దు చేసింది. అనంతరం పర్యాటక శాఖ అధికారులు శనివారం బీచ్‌లోని బ్లా జెండాలను కిందికి దింపేశారు. నిర్వహణ లోపం వల్లే ఆర్కే బీచ్ బ్లూ ఫాగ్ గుర్తింపు కోల్పోయిందని స్థానికులు ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news