బ్యూటిఫుల్ హీరోయిన్ నేహా శెట్టి DJ Tillu సినిమాతో తన పాపులారిటీని ఇంకా పెంచేసుకుంది. ఈ పిక్చర్ తో నేహా..కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయిందని చెప్పొచ్చు. ఈ చిత్రంలో ‘రాధిక’గా నేహా శర్మ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు.
అమాయకమైన అమ్మాయిగా కనిపిస్తూనే కన్నింగ్ బిహేవియర్ ప్లే చేసిన నేహా శెట్టి..టాక్ ఆఫ్ ది ఫిల్మ్ నగర్ టౌన్ అయిపోయింది. సిద్ధు జోన్నలగడ్డకు జోడీగా నటించిన ఈ సుందరి..సోషల్ మీడియాలోనూ బాగానే యాక్టివ్ గా ఉంటుంది.
‘ముంగరు మాలే 2, మెహబూబా, గల్లీ రౌడీ, నరుడి బతుకు నటన’ చిత్రాల్లో కథానాయికగా నటించిన ఈ సుందరి..ఆ చిత్రాల ద్వారా అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ, డీజే టిల్లు సినిమాతో ఈ భామ బాగా పాపులర్ అయింది. ఈ భామ సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
సదరు ఫొటోల్లో నేహా శెట్టి సంప్రదాయానికి ప్రతీక అయిన ఎల్లో కలర్ చీర లో ఉంది. అయినప్పటికీ ఆమె తన హాట్ నెస్ నెట్టింట హీట్ పెంచేస్తోంది. ఎద అందాలతో పాటు నడుము అందాలు ఎరవేసి కుర్రకారును ఫిదా చేస్తోంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు బ్యూటిఫుల్ భామ, అహో..సుందరి అని పోస్టులు పెడుతున్నారు. ‘డీజే టిల్లు’ చిత్రం తర్వాత ఈ భామకు సినిమాల్లో మంచి ఆఫర్స్ వచ్చాయని తెలుస్తోంది. త్వరలో ఆ చిత్రాల అనౌన్స్ మెంట్స్ వస్తాయని సమాచారం.