నేపాల్ కాట్మాండులో భూకంపం. 4.3 తీవ్రతో కంపించిన భూమి

-

హిమాలయ దేశం నేపాల్ మరోసారి ఉలిక్కిపడింది. రాజధాని కాట్మాండుకు సమీపంలో భూకంపం వచ్చింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగలు తీశారు. రాజధాని కాట్మాండుకు తూర్పు- ఈశాన్యంగా 166 కిలోమటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈరోజు తెల్లవారుజామున 4:37 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.నేపాల్ లో తరుచుగా భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల పరిధిలో నేపాల్ ఉంది

2015, ఎప్రిల్ సంభవించిన భూకంపం తాలూకు జ్ఞాపకాల నుంచి నేపాల్ ఇంకా కోలుకోలేదు. ఆ సయమంలో రెండు శక్తి వంతమైన భూకంపాలు నేపాల్ ను తాకడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి. ఆ సయమంలో ఈ భూకంపం వల్ల దాదాపుగా 9 వేల మంది మరణించారు. రిక్టర్ స్కేల్ పై 7.8 తీవ్రతతో అప్పట్లోె భూకంపం సంభవించింది. తాజాగా మరోసారి ఇలా భూకంపం సంభవించడంతో ఉలిక్కిపడింది ఈ హిమాలయ దేశం.

Read more RELATED
Recommended to you

Latest news