Nepal: విమాన ప్రమాదంలో దొరికిన శకలాలు.. గల్లంతైన భారతీయులు వీరే..

-

నేపాల్ లో జరిగిన ఘోర విమానం ప్రమాదంలో 22 మంది గల్లంతయ్యారు. దాదాపుగా వీరంతా మరణించే ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఆదివారం ఉదయం 10 గంటలకు తారా ఎయిర్ కు చెందిన టర్బోప్రాప్ ట్విన్ ఇంజిన్ విమానం ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. విమానం పొఖారా నుంచి జమ్సన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ప్లేన్ లో నలుగురు భారతీయులతో పాటు ముగ్గురు జపాన్ వాసులు, మిగలిన వారంతా నేపాల్ కు చెందిన ప్రయాణికులు ఉన్నారు. మొత్తం 19 మంది ప్రయాణికులు నలుగురు విమాన సిబ్బంది మొత్తంగా 22 మంది గల్లంతయ్యారు.

తాజాగా ఈ రోజు ముస్తాంగ్ జిల్లా థాసాంగ్ -లోని సనోస్ వేర్ ప్రాంతంలో విమాన క్రాష్ సైట్ గుర్తించారు అధికారు. విమానం బలంగా కొండను ఢీకొనడంతో శకలాలుగా మారిపోయింది. నిన్న ఆకాశంలో ఎగురుతురన్న విమానాాన్ని ముస్తాంగ్ జోమ్సోమ్ ఆకాశంలో కనిపించిందని.. ఆ తరువాత మౌంట్ ధవళగిరి వైపు మల్లించారని.. ఆ తరువాతే విమానంతో సంబంధాలు తెగిపోయినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులు ఉన్నారు. వీరు ముంబైలోని థానే ప్రాంతానికి చెందిన అశోక్ కుమార్ త్రిపాఠి, అతని భార్య వైభవి బాండేకర్ (త్రిపాఠి) మరియు వారి పిల్లలు ధనుష్ మరియు రితికగా గుర్తించారు. ప్రస్తుతం వైభవ్ త్రిపాఠి తల్లి ఆరోగ్యం బాగా లేనందున విషయాన్ని చెప్పవద్దని అధికారులను వైభవ్ త్రిపాఠి అక్క కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version