ప్రపంచంలోని ఎత్తైన శిఖరం అయిన మౌంట్ ఎవరెస్ట్ కొత్త ఎత్తును నేపాల్ అతి త్వరలో ప్రకటించబోతోంది. బుధవారం సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో… ఎవరెస్ట్ శిఖరం ఎత్తును ప్రకటించడానికి నేపాల్ భూ నిర్వహణ మంత్రిత్వ శాఖకు అనుమతి ఇచ్చింది. శిఖరం గతంలో కంటే ఎక్కువ ఎత్తుగా కనిపించినప్పటికీ ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. నేపాల్ భూ నిర్వహణ శాఖ మంత్రి పద్మ కుమారి ఆర్యాల్ మాట్లాడుతూ….
మా స్వంత వనరులతో, ఎవరెస్ట్ కొలతను పూర్తి చేశామని, అతి త్వరలో ప్రకటించబోతున్నామని చెప్పారు. 2015 భూకంపం తరువాత మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు గురించి చాలా ఆందోళనలు ఉన్నాయి. 2017 నుంచి నేపాల్ ఎత్తు కొలిచే ప్రక్రియను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా అంగీకరించిన 8,848 మీటర్లకు వ్యతిరేకంగా 2015 లో చైనా ఏకపక్షంగా ఎవరెస్ట్ ఎత్తును 8,844.04 మీటర్‌లు ప్రకటించడంతో నేపాల్, చైనా ఎవరెస్ట్ ఎత్తుపై అనేక విభేదాలు ఉన్నాయి