నేపాల్ రాజకీయ సంక్షోభం మరింత తీవ్రం.. మళ్లీ వాయిదా

-

నేపాల్​లో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. అధికార నేపాల్​ కమ్యూనిస్టు పార్టీ ఎగ్జిక్యూటివ్ ఛైర్​పర్సన్​ పుష్ప కమల్ దహల్ “ప్రచండ” ఏక పక్షంగా స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి లేకుండా.. ప్రధాని అధికారిక నివాసంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.

nepal
nepal

నిజానికి మంగళవారం ఉదయం 11 గంటలకు 45 మంది సభ్యులతో కూడిన కీలక స్టాండింగ్ కమిటీ భేటీ కావాల్సి ఉంది. అయితే 9వ సారి కూడా ఈ సమావేశం వాయిదా పడింది.ఇరువురు నాయకుల మధ్య తలెత్తిన వివాదాలను అనధికారిక సంప్రదింపుల ద్వారా పరిష్కరించేందుకు మరింత సమయం అవసరమని స్టాండింగ్ కమిటీ సభ్యులైన గణేశ్​ షా తెలిపారు. ఇందుకోసమే సమావేశం వాయిదా వేసినట్లు వివరించారు.ప్రధాన మంత్రి ఓలి మీడియా సలహాదారు.. సూర్య తాపా ఈ విషయాన్ని ఫేస్​బుక్ ద్వారా వెల్లడించారు. ఇరువురు నేతలు సంప్రదింపులకోసం మరింత సమయం కోరుకుంటున్నట్లు తెలిపారు. సంప్రదింపులు పూర్తయిన తర్వాత స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించే తేదీని ఖరారు చేయనున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news