తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరో నాగ శౌర్య కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందన్న విషయం తెలిసిందే. కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న నాగశౌర్య మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఇటీవలే తన కొత్త సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేసి అభిమానులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ లో సిక్స్ ప్యాక్ తో బాణం చేతపట్టుకొని వారియర్ ఫోజ్ లో నాగశౌర్య లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే తాజాగా సిక్స్ ప్యాక్ గురించి నాగశౌర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిక్స్ ప్యాక్ అంటే భార్యతో సమానమని… జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటూ నాగశౌర్యా సూచించారు. ఇక ఈ కథకు సిక్స్ ప్యాక్ ఎంతో అవసరం అని అందుకే ఎంతో కష్టపడి సిక్స్ ప్యాక్ చేయాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు నాగశౌర్య. 3 నెలలపాటు అసలు రైస్ జోలికి వెళ్లకుండా కష్టపడితేనే సిక్స్ ప్యాక్ వచ్చింది అంటూ తెలిపాడు.