ఇండియాలో జియో సేవ‌ల్లో అంత‌రాయం…

ఇండియాలో రిలయన్స్ జియో మొబైల్ నెట్ వర్క్ సేవలకు అంత రాయం కలిగినట్లు సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని డౌన్ డిటెక్టర్ అనే సంస్థ వెల్లడించింది. నెట్వర్క్ సమస్య గురించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగినట్లు డౌన్ డిటెక్టర్ పేర్కొంది. అయితే దీని ప్రభావం ఏ మేరకు ఉందో అనేది తెలియాల్సి ఉందని చెప్పింది.

అటు జియో నెట్వర్క్ లో అంతరాయం పై వినియోగదారులు ట్విట్టర్లో ఈ పోస్టులు పెడుతున్నారు. ఇండియాలో జియో డౌన్ అనే హాస్టల్ కూడా ట్రెండ్ అవుతున్నట్లు డౌన్ డిటెక్టర్ తెలిపింది. ఈరోజు లో ఇప్పటి వరకు దాదాపు నాలుగు వేల మంది వినియోగదారులు ఈ నెట్ వర్క్ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ లను బట్టి చూస్తే… నెట్వర్క్ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రిలయన్స్ జియో యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా… 2 రోజుల క్రితం ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ మరియు వాట్సాప్ లు దాదాపు తొమ్మిది గంటల పాటు ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వినియోగదారులు చాలా ఇబ్బందులు పడ్డారు.