భారత ప్రభుత్వం :నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ జయంతిని ‘పరాక్రమ్ దివస్’గా పాటించాలి..!

-

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణ లో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఈ స్వాతంత్య్ర సమరయోధుడు జయంతిని ప్రతి సంవత్సరం ‘పరాక్రమ్ దివస్’ గా పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన అందించిన సేవలకు గాను స్మరించుకునేందుకు ఈ ‘పరాక్రమ్ దివస్’ జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఈ విషయాన్ని మంగళవారం నాడు కేంద్ర సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఇలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటన పై చర్చించేందుకు బెంగాల్ పోలీసులు, ప్రధానికి రక్షణ కల్పిస్తున్న ఎస్‌పీజీ సోమవారం నాడు సమావేశమైనట్టు కూడా తెలుస్తోంది. కోల్‌కతా లోని విక్టోరియల్ మెమోరియల్ ‌లో ఈనెల 23న నేతాజీ జయంత్యుత్సవం జరగనుంది. అందులో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.

అలానే అలిపోర్‌ లోని బల్వెడెర్ ఎస్టేట్‌లో ఉన్న నేషనల్ లైబ్రరీని కూడా ప్రధాని సందర్శిచనున్నారు. విక్టోరియా మెమోరియల్, నేషనల్ లైబ్రరీ ఈవెంట్‌లను ఖరారు చేసినట్టు కూడా తెలుసుతోంది. అంతే కాదు త్వరలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు జరుగనున్న నేపథ్యం లో ఆ రాష్ట్ర బీజేపీ నేతల తో మోదీ సమావేశం కావచ్చని తెలుస్తోంది. రాజకీయ ఎలాంటి కార్యక్రమాలు ఉండవు కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పాదయాత్ర ఉన్నట్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version