ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్ కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.5కే స్ట్రీమింగ్ సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. అయితే అది కేవలం మొదటి నెల మాత్రమే. రెండో నెల నుంచి కస్టమర్లు తాము ముందుగా ఎంచుకున్న ప్లాన్ ప్రకారం చార్జిలు ఉంటాయి. ఇక ఈ ఆఫర్ మొదటి సారి నెట్‌ఫ్లిక్స్‌ను వాడేవారికి మాత్రమే వర్తిస్తుందని ఆ కంపెనీ తెలిపింది.
వినియోగదారులు రూ.5తో మొదటి నెల స్ట్రీమింగ్ సర్వీసులను పొందవచ్చని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఆ తరువాత 2వ నెల నుంచి ముందుగా తాము ఎంచుకున్న ప్లాన్ ప్రకారం చార్జిలు ఉంటాయని నెట్‌ఫ్లిక్స్ తెలియజేసింది. ఈ క్రమంలో మొదటి నెల కస్టమర్లు రూ.5తో నెట్‌ఫ్లిక్స్ సేవలను పొందితే 2వ నెల నుంచి రూ.199 మొదలుకొని రూ.499, రూ.649, రూ.799 ప్లాన్లలో ఏదో ఒక ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
నెట్‌ఫ్లిక్స్ అందజేస్తున్న ఈ ఆఫర్ నూతన కస్టమర్లకు మాత్రమే కాగా.. కంప్యూటర్, ఆండ్రాయిడ్ ఫోన్లను వాడే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆ కస్టమర్లు కొత్తగా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ను ప్రారంభిస్తే వారు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు..!