నెదర్లాండ్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో అద్భుతముగా పోరాడి వన్ డే వరల్డ్ కప్ ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ అందుకు తగినట్లు ఆడితేనే కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఈ రోజు మ్యాచ్ లో పాకిస్తాన్ ను బౌలింగ్ తో గడగడలాడించి 286 పరుగుల వద్ద ఉండగా ఆల్ అవుట్ చేశారు. ఒక పవర్ ఫుల్ టీం ను నెదర్లాండ్ అల్ అవుట్ చేయడం అంటే మాములు విషయం కాదు. కానీ పాకిస్తాన్ నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో తడబడింది. చేతుల్లోకి వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకుంది.. ఓపెనర్ విక్రమ్ జీత్ సింగ్ మరియు బస్ డే లీడ్ లు అర్ధ సెంచరీ లు చేసి టీం ను విజయపధంలో నడిపారు.. కానీ మిగతా వారి నుండి సరైన సహాయం లేకపోవడంతో నెదర్లాండ్ ఓటమి కోరల్లో ఉంది.
అనుభవం లేకపోవడం వలనే కీలక సమయంలో వరుస వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం నెదర్లాండ్ 186 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఇంకా విజయానికి 11 ఓవర్ లలో 101 పరుగులు కావాలి.. మరి బౌలర్లు ఈ స్కోర్ ను ఛేదిస్తారా చూడాలి.