పాక్ ఘన విజయం : నాగబాబు పై ట్రోలింగ్.. ఐరన్‌ లెగ్‌ అంటూ !

టీ 20 వరల్డ్‌ కప్‌ మొదటి మ్యాచ్‌ లోనే టీమిండియా ఘోర పరాజయం పాలైంది. అందులోనూ దయాది పాక్‌ స్థాన్‌ జట్టు పై టీమిండియా ఓడిపోవడంతో… క్రికెట్‌ లవర్స్‌ ఆందోళన చెందుతున్నారు. అయితే.. టీమిండియా ఓటమి సెగ మెగా బ్రదర్‌ నాగబాబు కు కూడా తాకింది. మెగా బద్రర్‌ నాగబాబను సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.

నిన్న ఇండియా మరియు పాకిస్థాన్ మ్యాచ్‌ చూసేందుకు నాగబాబు స్టేడియానికి వెళ్లడమే ఇందుకు కారణం. భారత్‌ ఓడిపోవడంతో నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ” ఎక్కడ లెగ్గు పెడితే అక్కడే ఓటమే” అంటూ మీమ్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. ప్రజా రాజ్యంలో చిరంజీవి, జనసేన పార్టీ లో పవన్‌ కళ్యాణ్‌, మా అర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ ను ఇలా ఎవరికి సపోర్ట్ చేసినా.. ఓడిపోతున్నారని ట్వీట్లు చేస్తున్నారు. కాగా.. నిన్న భారత్‌ మరియు పాక్‌ మ్యాచ్‌ కోసం నాగ బాబు మరియు వరుణ్‌ తేజ్‌ దుబాయ్‌ వెళ్లారు.