శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరపైకి రాబోతున్న చిత్రం `800`. ఇందులో మురళీధరన్‌గా విజయ్ సేతపతి నటిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటించరాదంటూ విమర్శలు మొదలయ్యాయి.
తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ దర్శకులు భారతీరాజా ఏకంగా విజయ్ సేతుపతిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ తమిళుడిగా ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటించడానికి వీలు లేదని, ఈ మూవీ నుంచి అతను వెంటనే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ముత్తయ్య మురళీధరన్ తమిళులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని అలాంటి వ్యక్తి బయోపిక్‌లో నటించడానికి వీళ్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ సంఘాలు కూడా భారతీరాజాకు వంతపాడాయి. దీంతో ముత్తయ్య మురళీధరన్ స్పందించాడు.
ఈ మూవీ నుంచి వెంటనే తప్పుకోమని విజయ్ సేతపతికి విజ్ఞప్తి చేశాడు. దీంతో తను ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు విజయ్ సేతుపతి. అయినా అతనికి వేధింపులు, విమర్శలు తప్పడం లేదు. విమర్శలు హద్దులు దాటేస్తున్నాయి. మురళీధరన్ బయోపిక్ నుంచి విజయ్ సేతుపతి తప్పుకోకుంటే అతని కుమార్తెని రేప్ చేస్తామంటూ ఓ ఆకతాయి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్స్ వెంటనే రియాక్ట్ అయ్యారు. అతన్ని జైల్లో పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.