మోడీ కబుర్లు చెప్పే టైం అయిపోయిందా…?

-

దేశ ఆర్ధిక అభివృద్ధి విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ చర్యలపై తీవ్ర స్థాయిలో విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం కాలేదు అంటే అప్పులకు వడ్డీలు కట్టడం కూడా భారంగా మారే ప్రమాదం ఉంది. ఎన్నో రాష్ట్రాలు కేంద్ర ఆర్ధిక సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. అయినా సరే కేంద్రం ఇప్పుడు రాష్ట్రాలకు అప్పులు ఇప్పించడం మినహా సహాయం చేయడం లేదు. దీనిపై ఆందోళన ఉండటమే కాదు బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా కేంద్రంపై యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్య నాథ్ కేంద్ర ఆర్ధిక శాఖకు లేఖ రాసి తమకు నిధులు కావాలని కోరినట్టుగా తెలిసింది. ఆయనతో పాటుగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యురప్ప కూడా కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఆదాయ వృద్ది మీద ఫోకస్ చేయలేకపోతుంది. క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు ఆదాయ మార్గాలు కూడా కనపడటం లేదు. మోడీ మాత్రం స్ఫూర్తి ప్రసంగాలు మాత్రమే చేస్తూ సమయం గడుపుతున్నారు.

వెనుకబడిన రాష్ట్రాలు, ఆదాయం పెరగని రాష్ట్రాలు కరోనాలో ఎంతగానో నష్టపోతున్నాయి.దేశ వృద్ది రేటు కూడా చాలా దారుణంగా పడిపోయింది. రానున్న రోజుల్లో ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. బీహార్ ఎన్నికల కోసం ఆ రాష్ట్రానికి కేంద్రం వరాలు ఇచ్చింది. కాని మిగిలిన రాష్ట్రాల వైపు చూడటం లేదు. ఏపీ, తెలంగాణా, ఈశాన్య రాష్ట్రాలు అన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు కూడా వరదలతో, తుఫాన్ ల దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉంది.

దేశ ఆర్ధిక వ్యవస్థలో కొన్ని కొన్ని అంశాలు ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఉద్యోగ కల్పన విషయంలో కేంద్రం ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. కాని ఆ విధంగా అడుగులు పడటం లేదు. చిన్న మధ్యతరహా కంపెనీలు అన్నీ కూడా అప్పుల్లో ఉన్న సమయంలో వారికి అప్పులు ఇచ్చి ప్యాకేజి అని చెప్పింది. అప్పులు ఇవ్వడం ఆర్ధిక సహాయం కాదు. కాబట్టి కేంద్రం ఇప్పుడు ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసే దిశాగా ముందుకు వెళ్ళలేదు అంటే మాత్రం దేశ పరిస్థితి మధ్యప్రాచ్య దేశాల కంటే వరస్ట్ గా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news