వాంకిడి గిరిజన విద్యార్థులను పరామర్శించిన మంత్రులు

-

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల లో అనారోగ్యానికి గురైన విద్యార్థినులను నిమ్స్ ఆసుపత్రి లో మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ లు పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పై వారు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు త్వరగా కోలుకునే విధంగా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు.

ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ధైర్యంగా ఉండాలని తల్లి దండ్రులకు వారు భరోసా కల్పించారు. విష ఆహారంతో అస్వస్థత పాలై వివిధ ఆసుపత్రుల్లో ఉన్న వారందరికీ మంచి వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదని.. అందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. ఈ ఘటన పై విచారణ జరిపి బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు మాజీ మంత్రి హరీశ్ రావు ఈ బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం పై ఘాటైన విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news