విజ‌య్ సేతుప‌తి కూతురికి బెదిరింపులు!

-

 

శ్రీ‌లంక లెజెండ‌రీ క్రికెట‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ జీవిత క‌థ ఆధారంగా తెర‌పైకి రాబోతున్న చిత్రం `800`. ఇందులో ముర‌ళీధ‌ర‌న్‌గా విజ‌య్ సేత‌ప‌తి న‌టిస్తున్నాడు. ఇటీవ‌ల ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఇక్క‌డి నుంచే అస‌లు క‌థ మొద‌లైంది. ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి న‌టించరాదంటూ విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.

త‌మిళ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కులు భార‌తీరాజా ఏకంగా విజ‌య్ సేతుప‌తిని టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ త‌మిళుడిగా ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి న‌టించ‌డానికి వీలు లేద‌ని, ఈ మూవీ నుంచి అత‌ను వెంట‌నే త‌ప్పుకోవాల‌ని డిమాండ్ చేశారు. ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్ త‌మిళుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశాడ‌ని అలాంటి వ్య‌క్తి బ‌యోపిక్‌లో న‌టించ‌డానికి వీళ్లేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మిళ సంఘాలు కూడా భార‌తీరాజాకు వంత‌పాడాయి. దీంతో ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ స్పందించాడు.

ఈ మూవీ నుంచి వెంట‌నే త‌ప్పుకోమ‌ని విజ‌య్ సేత‌ప‌తికి విజ్ఞ‌ప్తి చేశాడు. దీంతో త‌ను ఈ మూవీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించాడు విజ‌య్ సేతుప‌తి. అయినా అత‌నికి వేధింపులు, విమ‌ర్శ‌లు త‌ప్ప‌డం లేదు. విమర్శ‌లు హ‌ద్దులు దాటేస్తున్నాయి. ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్ నుంచి విజ‌య్ సేతుప‌తి త‌ప్పుకోకుంటే అత‌ని కుమార్తెని రేప్ చేస్తామంటూ ఓ ఆక‌తాయి సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీనిపై నెటిజ‌న్స్ వెంట‌నే రియాక్ట్ అయ్యారు. అత‌న్ని జైల్లో పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version