పెన్షన్ పొందే వారికి అలర్ట్.. వెంటనే ఈ పని చేసేయండి…!

-

కేంద్ర ప్రభుత్వ నుండి ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయ్యారా..? అయితే మీరు వెంటనే ఒక పని చేయాలి. మీ లైఫ్ సర్టిఫికెట్‌ను బ్యాంకుకు అందించాలి. ఇలా చేస్తేనే మీకు పెన్షన్ ఇకమీదట వస్తుంది. లేదంటే ఆగిపోతుంది.పెన్షన్ పొందే వారికి బ్యాంకులకు లైఫ్ సర్టిఫికెట్ అందించకపోతే పెన్షన్ నిలిపివేస్తారు. పెన్షన్ తీసుకునే వారు కచ్చితంగా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకొని, ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్ ను బ్యాంకుకు అందించాలి. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారు లైఫ్ సర్టిఫికెట్ సబ్‌మిట్ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2020 ఏడాదికి ఇది వర్తిస్తుంది.

 

కేంద్ర ప్రభుత్వ నుండి పెన్షన్ తీసుకుంటున్న వారు నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31లోపు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్ ‌ను బ్యాంకుకు అందించాలి. ఈ గడువులోగా ఈ పని పూర్తి చేయాలి.ఎవరైతే లైఫ్ సర్టిఫికెట్‌ను అందించకపోతే వారికి పెన్షన్ ఆగిపోతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పెన్షన్ తీసుకునే వారు జీవించి ఉన్నారని తెలియజేయడానికి ఈ లైఫ్ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. అయితే 80 ఏళ్లు లేదా ఆపైన వయసు ఉన్న వారు మాత్రం లైఫ్ సర్టిఫికెట్‌ను అక్టోబర్ 1 నుంచే అందించవచ్చు. డిసెంబర్ 31లోపు వారి జీవన్ ప్రమాణ్ పత్రాన్ని బ్యాంకుకు అందించాలి. పెన్షన్ తీసుకునే వారు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్‌ను బ్యాంకుకు కచ్చితంగా అందించాలి. ఇవ్వకపోతే మాత్రం వారి పెన్షన్ ఆగిపోతుంది.

ఈ లైఫ్ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో లేదా వారి బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్రాంచుకు వెళ్లి సమర్పించొచ్చు. ఆన్ ‌లైన్ ‌లో ఇవ్వాలని భావిస్తే జీవన్ ప్రమాణ్ వెబ్ ‌సైట్ ‌కు వెళ్లి చేసుకోవచ్చు. దీనికి మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ PPO నెంబర్, అకౌంట్ నెంబర్ వివరాలు ఉండాలి. ఇకమీదట కేంద్ర ప్రభుత్వ నుండి పెన్షన్ తీసుకునే వారికి ఇది ఒక హెచ్చరిక. వెంటనే చేయకపోతే మీ పెన్షన్ కట్ ఆవుతుంది. మరెందుకు ఆలస్యం వెంటనే ఆన్లైన్ లో కానీ, మీ దగ్గర్లో ఉన్న బ్రాంచుకు వెళ్లి మీ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version