ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర 2019 ఎన్నికల వరకు పర్సనల్ అసిస్టెంట్ గా పని చేశాడు శ్రీనివాస చౌదరి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో శ్రీనివాస్ చౌదరి చంద్రబాబు పిఎ పదవి నుండి తప్పుకోవటం జరిగింది. ఇటువంటి తరుణంలో తాజాగా ఐటీ అధికారులు గత కొన్ని నెలల నుండి దక్షిణాదిలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులపై వారి ఇళ్లపై కార్యాలయాలపై సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు దగ్గర పిఎ గా పనిచేసిన శ్రీనివాస్ చౌదరి దగ్గర భారీగా అక్రమాస్తులు బయట పడినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు రెండు వేల కోట్ల మేరకు ఆస్తులు సోదాల్లో దొరికినట్లు సమాచారం. దీంతో వైసిపి పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడిని విపరీతంగా తిట్టడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా నారా లోకేష్ మరియు చంద్రబాబు దగ్గర కూడా సోదాలు నిర్వహిస్తే కొన్ని లక్షల కోట్లు బయటపడతాయని విమర్శలు చేస్తున్నారు.
ఇటువంటి తరుణంలో వైసీపీ నాయకులకు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కౌంటర్ వేస్తూ…శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదన్నారు. అన్ని వేల కోట్లు ఆ వ్యక్తి దగ్గర దొరికితే చంద్రబాబు కి సంబంధం ఏమిటి అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. అయితే యనమల వేసిన ప్రశ్నలకు వైసిపి పార్టీ నేతల నుండి కాకుండా సోషల్ మీడియాలో నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. సాధారణమైన వ్యక్తి దగ్గర అన్ని వేల కోట్లు దొరుకుతాయా అని ప్రశ్నిస్తున్నారు. మీరు మాట్లాడే మాటలు లాజిక్ లేని విధంగా ఉన్నాయని ఆపండి యనమల గారు అంటూ విమర్శలు చేస్తున్నారు. కంగారుపడకండి అన్ని విషయాలు బయటపడతాయి అంటూ మరికొంతమంది కౌంటర్లు వేస్తున్నారు.