నువ్వు, నీ భర్త నీతులు చెబుతారు.. సినిమాల్లో అలా చూపిస్తారా..? సింగర్ చిన్మయిపై నెటిజన్ల ఫైర్..!

-

చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ తీస్తున్న మన్మథుడు 2 మూవీలో రకుల్ ప్రీత్ సింగ్‌ను అలా చూపించడంపై నెటిజన్లు చిన్మయిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ప్రముఖ నటుడు నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్‌లు ప్రధాన పాత్రల్లో మన్మథుడు 2 మూవీ తెరకెక్కుతున్న విషయం విదితమే. ఈ మూవీ టీజర్‌ను తాజాగా విడుదల చేయగా.. అందులో రకుల్‌ను అవంతిక పాత్రలో చూపించారు. అయితే అందులో రకుల్ పలు బోల్డ్ సన్నివేశాల్లో మనకు కనిపించింది. అలాగే ఓ సీన్‌లో సిగరెట్ తాగుతూ కూడా దర్శనమిచ్చింది. దీంతో ఆ చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయిని ఇప్పుడు నెటిజన్లు ఆడుకుంటున్నారు.

ఇటీవల అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను సింగర్ చిన్మయి, సమంతలు విమర్శించిన విషయం విదితమే. మహిళలను కొట్టడం, తిట్టడం.. ప్రేమించడంలో భాగమే అని సందీప్ వంగా అనడంతో అందుకు చిన్మయి, సమంతలు స్పందిస్తూ.. అర్జున్ రెడ్డి సినిమాను సందీప్ వంగా బాగా తీశారని, కానీ ఆయన తాజాగా అన్నమాటలను వ్యతిరేకిస్తున్నామని కామెంట్ చేశారు. మహిళలను కొట్టడం, తిట్టడం.. దాన్ని ప్రేమించడంలో ఒక భాగం సరికాదని వారు సందీప్‌ను ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

అయితే ఇప్పుడు చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ తీస్తున్న మన్మథుడు 2 మూవీలో రకుల్ ప్రీత్ సింగ్‌ను అలా చూపించడంపై నెటిజన్లు చిన్మయిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. నువ్వు, నీ భర్త సినిమాల్లో ఆడవాళ్లను అలా చూపిస్తారు… పైకి నీతులు చెబుతారు… మన్మథుడు 2 టీజర్‌లో రకుల్ ప్రీత్ సింగ్ సిగరెట్ తాగడాన్ని చూపించడంతోపాటు హీరోయిన్ షర్ట్ బటన్లు విప్పడం, ఫ్లర్టింగ్ చేయడాన్ని చూపించడం… ఎంత వరకు కరెక్ట్ అని నెటిజన్లు చిన్మయిని ప్రశ్నిస్తున్నారు. మన్మథుడు 2 మూవీలో ఉన్న పలు సీన్ల ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలని చూస్తున్నారంటూ.. పలువురు నెటిజన్లు చిన్మయిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా మన్మథుడు 2 మూవీ ఆగస్టు 9వ తేదీన విడుదల కానుండగా.. ఇందులో సమంత అతిథి పాత్రలో కనిపించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version